గోమాత సంరక్షణపై విశ్వహిందూ పరిషత్ ఆందోళన
రామాయంపేట: రామాయంపేటలో గోమాతల సంరక్షణ కోసం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో గోమాత సంరక్షణకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం స్థానిక ఎస్సై, ఎమ్మార్వోలను కలిసి గోమాతల రక్షణపై మెమోరండం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రాంత సహ సత్సంగ్ ప్రముఖ్ పుట్టి మల్లేశం మాట్లాడుతూ... 1977 గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కోరారు.
గోమాతల అక్రమ వధ, రవాణా జరుగుతున్నాయని, దీనిపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే గోశాల నిర్వహకులకు సరైన వసతులు కల్పించాలని, ప్రతి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం 100 ఎకరాల భూమిని కేటాయించి గోశాలలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులకు సబ్సిడీలు, గోమాతల సంరక్షణ ఖర్చుల కోసం పింఛన్ సదుపాయం కల్పించాలని కూడా కోరారు.






