18 April, 2026 | 8:23 PM

ప్రజల సంక్షేమాభివృద్ధి కోసమే జనగనన

18-04-2026 06:29 PM

తహసీల్దార్ శ్రీకాంత్ 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): ప్రజల సంక్షేమాభివృద్ధి, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు చేరవేయడమే లక్ష్యంగా ప్రభుత్వం 2027 జనగణన ప్రక్రియను ప్రారంభించిందని తహసీల్దార్ బాషపాక శ్రీకాంత్ అన్నారు. శనివారం అర్వపల్లిలోని పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ లో మొదటి దశ గృహగనన, జనగణన 3 రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ బాలునాయక్, పాఠశాల హెచ్ఎం శ్రీదేవి, ఫీల్డ్ ట్రైనర్స్ వి.సైదులు, కేవి సత్యనారాయణ, సూపర్వైజర్లు మధుకర్, డి.ఎల్లయ్య, కె.సీనయ్య, ఆర్.సైదులు, వివిధ పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.