18 April, 2026 | 8:17 PM

భూగర్భ ఆస్తులకు నష్టం కలవకుండా పటిష్ట చర్యలు

18-04-2026 06:37 PM

జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ 

మెదక్,(విజయక్రాంతి): శనివారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో విద్యుత్, నీటిపారుదల, టెలికాం), టి ఫైబర్, గ్రామపంచాయతీ, ఆర్ అండ్ బి, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్ అటవీ, ఇంట్రా గ్రిడ్ అధికారులతో  నుండి భూగర్భ ఆస్తులకు నష్టం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై వివిధ శాఖలకు అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. CBuD App ఈ యాప్‌ను భారత ప్రభుత్వం (DoT) రూపొందించింది. దీని ప్రధాన లక్ష్యం డిగ్గింగ్ (తవ్వకం) సమయంలో భూగర్భ లైన్లు దెబ్బతినకుండా కాపాడటం.

తవ్వకం ముందు సమాచారం ఇవ్వడం ఎక్కడ తవ్వకం చేయబోతున్నారో ముందుగా app లో నమోదు చేయవచ్చు అని తెలిపారు. భూగర్భ సదుపాయాల వివరాలు తెలుసుకోవడం ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న ఫైబర్ కేబుల్స్,గ్యాస్ పైపులు,నీటి లైన్లు ,వంటి  వివరాలు తెలుసుకోవచ్చు అని అన్నారు. భూగర్భ ఆస్తులకు (పైప్‌లైన్‌లు, కేబుల్స్, పునాదులు) నష్టం కలగకుండా తవ్వకాలు జరపడం చాలా ముఖ్యమని దీనికోసం తవ్వకాలకు ముందే భూగర్భ యుటిలిటీ మ్యాపింగ్ (GPR వంటి సాంకేతికతతో) ఉపయోగించి, అధికారులు, సంబంధిత సంస్థల అనుమతులు తీసుకోవాలన్నారు.

మానవీయ పద్ధతిలో జాగ్రత్తగా తవ్వడం, నిపుణుల పర్యవేక్షణ, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయడం తప్పనిసరిగా వివరించారు. భూగర్భ ఆస్తుల రక్షణకు తీసుకోవాల్సిన ముఖ్యమైన చర్యలపై తవ్వకం చేపట్టే ప్రదేశంలో ఉన్న భూగర్భ కేబుల్స్, పైపులైన్ల సమాచారాన్ని (GPR ఉపయోగించి ముందుగానే గుర్తించాలన్నారు. అనుమతులపై  సంబంధిత ప్రభుత్వ శాఖలు (విద్యుత్, నీటిపారుదల, టెలికాం) నుండి అనుమతులు మరియు మ్యాప్‌లను సేకరించుకోవాలని. సూచించారు. యంత్రాలను (JCB) వాడే ముందు, భూగర్భ వస్తువులున్నట్లు అనుమానం ఉన్న చోట చేతితో (మనుషులతో) జాగ్రత్తగా తవ్వాలని సూచించారు.

నిపుణులైన ఇంజనీర్ల పర్యవేక్షణలో మాత్రమే ఇటువంటి పనులు జరగాలని చెప్పారు. అప్రమత్తతలో భాగంగా తవ్వకం ప్రదేశంలో హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. తవ్వకాలు జరిపేటప్పుడు చట్టపరమైన నిబంధనలను పాటించడం, ప్రజల భద్రతను (ప్రభుత్వ ఆస్తులతో సహా) కాపాడడం మన కర్తవ్యం అని వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డి పి వో యాదయ్య, జిల్లా అటవీ అధికారి జోజీ, ఈడిఎం సందీప్ టి.ఫైబర్ మేనేజర్ ఈశ్వర్, టి.ఫైబర్ డీఈ అవినాష్, టి.ఫైబర్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రామ్, మిషన్ భగీరథ అధికారి సంపత్, గ్రిడ్ అధికారి నాగభూషణం, ఈఈపీఆర్ నర్సింలు తదితరులు పాల్గొన్నారు.