టిఆర్ఎస్ జిల్లా ఇన్చార్జిగా వినోద్
21-05-2026 02:47 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే21( విజయక్రాంతి): టిఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్చార్జిగా వాంకిడి మండల కేంద్రానికి చెందిన వినోద్ కరిమిల్ల ను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు.జిల్లాలోని రెండు నియోజకవర్గాలకు ఇన్చార్జిలను నియమించారు.సిర్పూర్ నియోజకవర్గానికి కావేటి సబితను నియమించగా ఆసిఫాబాద్ నియోజకవర్గ తో పాటు జిల్లా ఇన్చార్జిగా వినోద్ ను ఆ పార్టీ నియమించింది.క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని జిల్లా ఇన్చార్జ్ వినోద్ తెలిపారు.తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షురాలు కవితకు కృతజ్ఞతలు తెలిపారు.






