21 May, 2026 | 3:52 PM

రాజీవ్ గాంధీ దూరదృష్టి గల నాయకుడు

21-05-2026 02:49 PM

కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గొర్రె గంగాధర్ 

ఖానాపూర్ (విజయక్రాంతి): మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ దేశ భవిష్యత్తును మార్చేందుకు దూర దృష్టితో అనేక మార్పులను తీసుకువచ్చిన నాయకుడని ఖానాపూర్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గొర్రె గంగాధర్ అన్నారు. గురువారం రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఖానాపూర్ మార్కెట్ యార్డు వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు భారతదేశంలో సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చి మారుమూల ప్రాంతాల్లో టెక్నాలజీని చేరవేయడంలో, 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించడంలో కీలక పాత్ర పోషించారని, ఆయన సేవలను కొనియాడారు.  ఆయన ఆశయాలను సాధించేందుకు పాటుపడదామని అన్నారు .ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ మండలం నాయకులు పాల్గొన్నారు.