సర్పంచ్ తీరుపై నిరసన
02-03-2026 08:19 PM
కుబీర్,(విజయక్రాంతి): కుబీర్ మండలంలోని మర్లగూడ గ్రామానికి మిషన్ భగీరథ నీటి సరఫరాలో నిలిపివేసిన సర్పంచ్ తీరుపై గ్రామస్తులు నిరసన తెలిపారు. సోమవారం గ్రామంలో గత మూడు రోజుల నుంచి తమకు నీరు రావడంలేదని సర్పంచ్కు విన్నవించిన పట్టించుకోవడంలేదని వారు తెలిపారు. అనంతరం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి సమస్యను కలెక్టర్ దృష్టికి తెచ్చినట్టు గ్రామస్తులు తెలిపారు. విషయమై వెంటనే స్పందించిన కలెక్టర్ తగు చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు.




