16 May, 2026 | 6:30 PM

రసాయన శాస్త్రంలో టి .కరుణాకర్‌కు డాక్టరేట్

16-05-2026 05:42 PM

ముకరంపుర,(విజయక్రాంతి): శాతవాహన యూనివర్సిటీ, కరీంనగర్ లోని రసాయన శాస్త్ర విభాగంలో పరిశోధనకు గాను టి.కరుణాకర్ డాక్టరేట్(PhD) సాధించారని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, డాక్టర్ డి సురేష్ కుమార్  తెలిపారు. వీరు ప్రొఫెసర్ ఎం కోమల్ రెడ్డి  పర్యవేక్షణలో "సింథసిస్ ఆఫ్ సర్టెన్ న్యూ ప్రినైలేటెడ్, గ్లైకోసైలిటెడ్ అండ్ బెంజైలేటెడ్ హిటరోసైక్లిక్  డెరివేటివ్స్ ఫ్రం 5-O- మిథైలేటెడ్ ఎంబిలిన్ అండ్ దేర్ బయోలాజికల్ ఇవాల్యూయేషన్" అనే అంశంపై పరిశోధన చేశారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ యు ఉమేష్ కుమార్, రిజిస్ట్రార్  ప్రొఫెసర్ పి సతీష్ కుమార్,  అధ్యాపకులు   వీరిని అభినందించారు