సైన్స్ ఫెయిర్ తో విద్యార్థులకు విజ్ఞానం లభిస్తుంది
02-03-2026 08:16 PM
తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ ర్రాజుర సత్యం
ఖానాపూర్,(విజయక్రాంతి): పాఠశాలల్లో విద్యార్థులకు సైన్స్ ఫెయిర్లు నిర్వహించడం ద్వారా విద్యార్థులకు విజ్ఞానం లభిస్తుందని, ప్రస్తుత 11వ వార్డు కౌన్సిలర్, తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం అన్నారు. సోమవారం ఖానాపూర్ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో విద్యార్థులకు సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ సిఐ అజయ్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు, వాసవి క్లబ్ జోనల్ చైర్మన్ మహాజన్ జితేందర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పడాల ప్రభాకర్ తదితరులు ఉన్నారు.




