అక్రమ గోవులను తరలిస్తున్న లారీలు పట్టుకున్న గోరక్షకులు
16-05-2026 05:57 PM
చేగుంట: అక్రమంగా గోవులను తరలిస్తున్న లారీని చేగుంట గోరక్షక్ కార్యకర్తలు పట్టుకుని చేగుంట పోలీసులకు అప్పగించారు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వైపు తరలిస్తున్న గోవులను మాసాయిపేట మండలం రామంతాపూర్ హెచ్ పి పెట్రోల్ బంక్ సమీపంలో ముందస్తు సమాచారంతో గో రక్షక్ కార్యకర్తలు అడ్డగించారు. సమాచారం అందుకున్న చేగుంట ఎస్ చైతన్య కుమార్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని లారీ డ్రైవర్ తో పాటు మరో ఇద్దరిని అదుపు తీసుకున్నారు. లారీలో ఉన్న 30 గోవులను సురక్షితంగా, గోశాలకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.






