16 May, 2026 | 6:57 PM

Breaking News

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని దిష్టిబొమ్మ దగ్ధం చేసిన సీపీఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ   •   అనురాగ్ లో “హెటెరో ల్యాబ్స్ ఎస్ఎంటీ బ్రిడ్జ్ కోర్స్ 2026–27” ప్రోగ్రాం   •   గ్రామపంచాయతీ కార్మికుల జీతాలు పెంచాలి   •   అమరవీరులకు నివాళులు అర్పించిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రధాన కార్యదర్శి సంజీవరెడ్డి   •   తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి   •   కొనుగోలు చేసిన మక్కలని వెంటనే తరలించాలి   •   జాబ్ మేళాలో ఉద్యోగాల ఎంపిక   •   గ్రామంలో బెల్ట్ షాప్ లను ముసివేయాలి   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   అక్రమ గోవులను తరలిస్తున్న లారీలు పట్టుకున్న గోరక్షకులు   •  

నాగిరెడ్డిపేట్ మండలంలో రోడ్డెక్కిన రైతులు

16-05-2026 05:47 PM

మాల్తుమ్మెద గ్రామంలోని రైతులకు ఇబ్బందులు

ధాన్యం తూకం వేసిన 6000 సంచులు నిలువ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల ఇబ్బందులు పడుతున్న రైతులు

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల  ఇబ్బంది పడుతున్న రైతులు మాల్తుమ్మెద గ్రామంలోని రైతుల ఇబ్బందులు పంట చేతికి వచ్చిన నుండి అమ్మే వరకు మాల్తుమ్మెద గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాలకు లారీలు రాక వడ్లు ఎక్కడ నిలిచిపోయాయి. దానితో రైతులందరూ మాల్ తుమ్మెద గ్రామ గేటు వద్ద ధర్న ప్రభుత్వాల వల్ల ఇబ్బందులు మండలంలోని మాల్తుమ్మెద గ్రామంలో గత నెల 25వ తేదీన సొసైటీ మరియు ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

ఇప్పటివరకు సెంటర్లోకి రైతులు తెచ్చినటువంటి దాన్యం సుమారు 20 శాతం రెండు సెంటర్లో కల్పి 25 లారీల ధాన్యం మాత్రమే తీసుకెళ్లడం జరిగిందని ఇంకా మిగిలిన వరి ధాన్యం రెండు సెంటర్లు కలిపి 150 లారీల వరకు ధాన్యం నిల్వ ఉందని రైతులు తెలిపారు.ధాన్యం తూకం వేసినవి 6000 సంచుల బ్యాగులు నిల్వ ఉన్నాయన్నారు. ప్రభుత్వ వైఖరి ఈ విధంగా కొనసాగితే జులై వరకు కూడా వరి ధాన్యం కొనుగోలు పూర్తి కాదని రైతులు మండిపడ్డారు.

వరి ధాన్యం కాంట చేసి తరలి వెళ్లిన వాటిలో తరుగు సంచిలో నాలుగు నుండి ఐదు కేజీల వరకు రైస్ మిల్లర్లు తీసివేస్తున్నారని, ఇట్టి విషయంపై అధికారులకు తెలియజేసినప్పటికీ ఏమాత్రం స్పందించడం లేదని,కావున రైతుల కష్టాలను గుర్తించి వడ్ల సెంటర్లకు రోజు నాలుగైదు లారీలను పంపించాలని, రైస్ మిల్లర్ ఎక్కువ తరుగును కట్ చేయకుండా వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక ఎమ్మార్వోకు మాల్తుమ్మెద గ్రామస్తులు వారి బాధలను వివరిస్తూ వినతి పత్రాన్ని అందజేశారు.