కేంద్ర నిధులతోనే గ్రామాల అభివృద్ధి
ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
నిర్మల్/లక్ష్మణచందా, ఏప్రిల్ ౨౧ (విజయక్రాంతి): నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ భాగ్యనగర్ పోచంపాడు గ్రామంలో ప్రభుత్వ నిధులతో చేపట్టే పనులను బీజేఎల్పీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శంకు స్థాపన చేశారు.
ఇందులో రూ. 10 లక్షలతో ఎస్‌హెచ్‌జీవీవో భవన నిర్మాణానికీ, రూ. 10 లక్షలతో ఎస్‌హెచ్‌జీవీవో భవన వర్క్ షెడ్ నిర్మాణానికి, రూ.18 లక్షలతో ఎంపీపీఎస్ స్కూల్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి, రూ. 20 లక్షలతో జడ్‌పీ హెచ్‌ఎస్ స్కూల్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, మండల అధ్యక్షులు వెంకట్ రెడ్డి, బీజేపీ నాయకులు రాజేందర్, రణధీర్, గ్రామ సర్పంచ్ ఎర్రగోల్ల ముత్తవ్వ పాల్గొన్నారు.
అలాగే లక్ష్మణచందా మండల కేంద్రంలో రూ.14 లక్షలతో ఊర చెరువు మరమ్మతులకు, రూ. 8లక్షలతో పులి చెరువు మరమ్మతులకు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, గ్రామ సర్పంచ్ ఓస కవితా రాజు సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, మండల అధ్యక్షులు చిన్నయ్య, నాయకులు అడ్వాల రమేష్, మండల బీజేపీ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్ పాల్గొన్నారు.






