22 April, 2026 | 4:34 AM

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ధ్వేయం

22-04-2026 01:21 AM

మేడేపల్లి, వనంవారి కిష్టాపురంలో మొక్కజొన్న కోనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రాయల నాగేశ్వరరావు

ఖమ్మం, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): రైతులసంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అని, రైతులు కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు అన్నారు. ముదిగొండ మండలం మేడేపల్లి, వనంవారి కిష్టాపురంలో  మొక్కజొన్న కోనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డిసిసి మాజీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ తో కలిసి ప్రారంభించారు.. తెలంగాణలో రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ద్వేయమని రాయల నాగేశ్వరరావు పేర్కొన్నారు..

రైతు పండించిన ప్రతి గింజను మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు.. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుంది అన్నారు.. రైతన్నలు ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు ప్రభుత్వం నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాల ద్వారానే గిట్టుబాటు ధర లభిస్తుంది అన్నారు..రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు..ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షులు పుచ్చలకాయల వీరభద్రం, మాత్కేపల్లి మార్కెట్ వైస్ చైర్మన్ పర్సాగాని తిరుపతిరావు, సర్పంచ్ లు సరళా, మమత, చెరుకుపల్లి జగన్నాధం, సోసైటీ మాజీ చైర్మన్ సామినేని వెంకటేశ్వరరావు, పసుపులేటి దేవేందర్, మల్లిఖార్జునరావు, మల్లెల అజయ్, బందెల నాగార్జున పాల్గొన్నారు.