మొబైల్స్ పోతే ఫిర్యాదు చేయండి
22-04-2026 01:18 AM
నిర్మల్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోయిన మొబైల్స్‌ను గుర్తించి వాటిని పోసీసు శాఖ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ఎస్పీ జానకి షర్మిల మంగళవారం అందజేశారు. సెల్‌ఫోన్ పోగొట్టుకున్న వారు వెంటనే ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయాలని, ఇప్పటివరకు జిల్లాలో రూ.2.56 కోట్ల విలువచేసే సెల్‌ఫోన్లు పట్టుకొని లబ్ధిదారులకు అందించినట్టు ఆమె తెలిపారు. సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనేముందు ప్రజలు ఆ ఫోన్ వివరాలను పూర్తిగా తెలుసుకోవాలని ఎస్పీ సూచించారు.






