19 June, 2026 | 6:23 PM

వైభవంగా గ్రామ దేవత విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు

19-06-2026 04:37 PM

జైనథ్,(విజయక్రాంతి): జైనథ్ లోని పురాతన గ్రామ దేవత శ్రీ మహా లక్ష్మీ అమ్మ వారి గుడి నీ పునరుద్ధరణ చేసి నూతన విగ్రహాన్ని ప్రతిష్టపణ వేడుకలు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం గ్రామస్తులందరూ పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి కరుణాకటాక్షాలు తనపై ఉండాలని మొక్కలు తీర్చుకున్నారు. విసృతంగా వర్షాలు కురియాలని, అందరూ సుఖసంతోషాలతో ఉండాలని గ్రామ ప్రజలు పూజలు చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గడ్డం మమతా జగదీశ్ రెడ్డి పాల్గొని  పూజా  చేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు  పాల్గొన్నారు.