19 June, 2026 | 6:24 PM

కాంగ్రెస్ నాయకుల మర్యాదపూర్వక భేటీ

19-06-2026 04:39 PM

నూతన సీఐ ఎల్లయ్యకు ఘన సన్మానం

అశ్వాపురం,(విజయక్రాంతి): అశ్వాపురం పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా బాధ్యతలు స్వీకరించిన సిలివేరు ఎల్లయ్యను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఓరుగంటి భిక్షమయ్య ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, సర్పంచులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ ఎల్లయ్యకు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి, అశ్వాపురం మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు సమర్థవంతంగా పనిచేస్తూ ప్రజలకు స్నేహపూర్వక పోలీసు సేవలు అందించాలని ఆకాంక్షించారు. అనంతరం సీఐ ఎల్లయ్య మాట్లాడుతూ తనపై చూపిన ఆదరణకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రజల సహకారంతో శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తానని, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.