అధైర్య పడవద్దు అండగా ఉంటా- మాజీ ఎమ్మెల్యే
బాధ్యత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ
కారేపల్లి,(విజయక్రాంతి): కారేపల్లి మండలంలో వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్య రాములు నాయక్ శుక్రవారం విస్తృతంగా పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. భాగ్యనగర్ తండాకు వార్డు సభ్యులు భూక్య కిషన్ కుమారుడుకి ఇటీవల కారు ప్రమాదంలో గాయాలవ్వడంతో బాధితుడి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆల్యాతండాలో సీనియర్ నాయకులు దారవత్ రాంజీ తండ్రి హరిసింగ్ గురువారం మరణించడంతో వారి కుటుంబ సభ్యులు పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
గుట్టకిందగుంపులో అనారోగ్యంతో ఉన్న మాజీ ఉపసర్పంచ్ గౌస్ పాషా ఉషా తండ్రి షేక్ సైదాను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు నిత్యం అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే వెంట ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, మాజీ జడ్పీటీసీ ఉన్నం వీరేందర్, మాజీ వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, మండల నాయకులు అజ్మీర వీరన్న, భూక్య రాంకిషోర్, వాంకుడోత్ నరేష్, ఏన్కూరు మండల మాజీ అధ్యక్షుడు బాణోత్ సురేష్, నాయకులు గుగులోత్ హారు, బాణోత్ కోటి, వాంకుడోత్ కరణ్ సింగ్, వాంకుడొత్ సతీష్, గుగులోత్ సురేష్, జాల సాంబ, 8వ వార్డు సభ్యులు గుగులోత్ నాగేశ్వరరావు, దస్తగిరి, మన్సూర్, ఖలీల్, సర్వర్ తదితరులు పాల్గొన్నారు.






