19 June, 2026 | 7:33 PM

గత పాలకుల అరాచకంతో వందేళ్ల నష్టం: సీఎం రేవంత్

19-06-2026 05:46 PM

విధ్వంసమైన విద్యాశాఖ వికాసం వైపు

విద్యార్థుల ఆత్మగౌరవం కోసమే ఎడ్యుకేషన్ కిట్లు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో(Hyderabad LB Stadium) సర్కారు పాఠశాలలు, సంక్షేమ గురుకులాల విద్యార్థులకు ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth reddy), గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో కలిసి సంపూర్ణ కిట్లు పంపిణీ చేశారు. గురుకుల విద్యార్థులకు 22,పాఠశాల విద్యార్థులకు 7 వస్తువులతో కిట్లు, వసతిగృహ విద్యార్థులకు 10 వస్తువులతో కూడిన పంపిణీ చేస్తున్నారు. యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్ల  పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ...  విద్యార్థులు ఆత్మగౌరవంతో పాఠశాలకు వెళ్లేందుకు ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ(Distribution of education kits) చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ.. భాష ప్రయుక్త రాష్ట్రంగానో.. పాలన సౌలభ్యం కోసమో ఏర్పడిన రాష్ట్రం కాదని సూచించారు. 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటం విద్యార్థుల ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని వెల్లడించారు. తెలంగాణ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు, ఉపాధి కోసం త్యాగాలు చేశారని గుర్తుచేశారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది.. తరగతి గదులను పునరుద్ధరించాలని ఆదేశించారు. విధ్వంసమైన విద్యాశాఖను వికాసం వైపు నడిపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. విద్యకు బడ్జెట్ లో 8.5 శాతం నిధులు కేటాయించామని వివరించారు. వెనుకబడిన విద్యార్థుల కోసం రూ. 26,600 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. భావితరాల భవిష్యత్తు నిర్ణయించే పెట్టుబడులుగా భావిస్తున్నామని చెప్పారు. ఉద్యోగులకు జీతాల మాదిరిగానే ప్రతినెలా 1న విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీల చెల్లిస్తున్నామని వెల్లడించారు.

తెలంగాణ విద్యాశాఖను(Telangana Education Department) గతంలో విధ్వంసం చేశారని సీఎం ఆరోపించారు. విద్యపై నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నామని వివరించారు. బీఆర్ఎస్ పాల్పడ్డ అరాచకంతో తెలంగాణకు వందేళ్ల నష్టం జరిగిందని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ తయారుచేసి  ప్రక్షాళన చేపట్టామన్నారు. ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్(Telangana Public School) లో నో అడ్మిషన్ బోర్డు పెట్టారని తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లలో నో అడ్మిషన్ బోర్డు పెట్టే పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించి ఉండరని చెప్పారు. ప్రతి పేదవాడికి నాణ్యమైన విద్య అందాలనే విద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్నట్లు తెలిపారు. పేద, మధ్య తరగతి ప్రజలు పిల్లలను ఇంగ్లీష్ మీడియం చదివించాలనుకుంటున్నారని, పస్తులుండైనా.. పిల్లలను ప్రయోజకులను చేయాలనుకుంటున్నారని పేర్కొన్నారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు.. ఎడ్యుకేషన్ మోడల్(Education Model)ను తయారు చేస్తుకున్నామని పేర్కొన్నారు.