మంచినీటి పైపులైన్ పనులు ప్రారంభం
19-06-2026 06:05 PM
ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ 19వ డివిజన్లో మంచినీటి పైపు లైన్ పనులను హనుమాన్ నగర్ లో ప్రారంభించారు .డివిజన్లో అమృత్ సర్ పథకం క్రింద నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తి అయ్యేలోవు డివిజన్ లో మిగిలి ఉన్నటువంటి ప్రతి కాలనిలో పైప్ లైన్ వేయడం జరుగుతుంది. కావున డివిజన్ ప్రజలు సహకరించాలని అతి త్వరలో పూర్తి స్థాయిలో మంచి నీటి కొరత లేకుండా చేస్తామని 19వ డివిజన్ కార్పోరేటర్ సుధగోని మాధవి-కృష్ణ గౌడ్ తెలిపారు. వీరి వెంట స్థానిక నాయకులు మజీద్ సాదిక్ గౌసి మున్సిపల్ వాటర్ సప్లై సిబ్బంది ఉన్నారు.






