ప్రతిరోజూ బెల్లంపల్లికి తాగునీరు
- మునిసిపల్ చైర్ పర్సన్ దావస్వాతి
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణ ప్రజలకు ప్రతిరోజూ ఆడ ప్రాజెక్టు నుంచి తాగునీటి సరఫరా కోసం మునిసిపల్ చైర్ పర్సన్ దావస్వాతి, మునిసిపల్ కమిషనర్ తన్నీరు రమేశ్,అధికారులతో కలసి ఆసిఫాబాద్ అడ ప్రాజెక్టును పరిశీలించారు. ఈ మేరకు ఆసిఫాబాద్ జిల్లా మిషన్ భగీరథ SE, DE, EE సంబంధిత అధికారులను కలిసి బెల్లంపల్లిలో నెలకోన్న నీటి ఎద్దడి సమస్యను వివరించారు. తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు.
బెల్లంపల్లి పట్టణానికి అడా ప్రాజెక్టు నుంచి ప్రతిరోజు నీరు సరఫరా అవ్వాల్సి ఉండగా, ప్రతి 10 రోజులకు ఒకసారి మాత్రమే నీటి సరఫరా చేస్తుండడంతో పట్టణ ప్రజలు నీటి ఎద్దడికి వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బెల్లంపల్లి పట్టణంలో నీటి ఎద్దడి సమస్య పరిష్కారానికై ప్రతిరోజు 6 MLD నీటిని సరఫరా చేయాలని అధికారులను కోరారు. ఈ విషయమై సానుకూలంగా స్పందించిన ఆసిఫాబాద్ మిషన్ భగీరథ అధికారులు 4 నుంచి 5 MLD లకు తగ్గకుండా బెల్లంపల్లి పట్టణానికి ప్రతిరోజు నీరు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారని మునిసిపల్ చేర పర్సన్ దావస్వాతి తెలిపారు. అడ ప్రాజెక్టు ను సందర్శించిన చైర్ పర్సన్ దావస్వాతి వెంట పలువురు మునిసిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.






