19 June, 2026 | 6:23 PM

విద్య, వైద్యానికి మంత్రి శ్రీధర్ బాబు పెద్దపీట

19-06-2026 04:34 PM

బేగంపేట పాఠశాలలో నూతన నిర్మాణ పనులకు భూమి పూజలో దాసరి శివ

రామగిరి,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, అందులో భాగంగానే మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నియోజకవర్గంలో పాఠశాలల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాసరి శివ పేర్కొన్నారు. శుక్రవారం రామగిరి మండలం బేగంపేట గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో నూతన నిర్మాణ పనుల కొరకు ఆయన గ్రామ ప్రజలతో కలిసి శుక్రవారం భూమి పూజ నిర్వహించారు.

20 లక్షల నిధులు మంజూరు

ఈ సందర్భంగా దాసరి శివ మాట్లాడుతూ, బేగంపేట గ్రామంలోని జిల్లా పరిషత్ మరియు ప్రాథమిక పాఠశాలల అభివృద్ధి కోసం మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవ తీసుకుని  రూ. 20 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారని తెలిపారు. గతంలోనే పాఠశాలల చుట్టూ ప్రహరీ గోడల నిర్మాణం, విద్యార్థుల కోసం అధునాతన మరుగుదొడ్లు, మూత్రశాలల ఏర్పాటుతో పాటు డిజిటల్ బోర్డులను సైతం మంత్రి సమకూర్చారని ఆయన గుర్తు చేశారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.