రోడ్డు ప్రమాదం గాయపడి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
చిట్యాల: చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన జరిగింది. మృతుడు చెరబహదూర్ (47) పిట్టంపల్లిలోని శ్రీ పైప్స్ అండ్ ఇన్‌ఫ్రా కంపెనీలో పనిచేస్తూ, ప్రస్తుతం చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామంలో నివాసం ఉంటున్నాడు. ఆయన స్వస్థలం అస్సాం రాష్ట్రంలోని నాగోల్ ప్రాంతం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చెరబహదూర్ ఈ నెల 14 న కూరగాయల కొనుగోలు కోసం వెలిమినేడు గ్రామానికి వెళ్లాడు.
అనంతరం తన ద్విచక్ర వాహనం (టీఎస్ 05 సీజీ 7026)పై వెలిమినేడు నుంచి పిట్టంపల్లి గ్రామానికి తిరిగి వస్తుండగా సెవెంటీ కం కంపెనీ సమీపానికి చేరుకోగానే బైక్ అదుపుతప్పి పడిపోయాడు. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన చెరబహదూర్‌ను వెంటనే చికిత్స నిమిత్తం కామినేని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి లైన్ బహదూర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిట్యాల ఎస్‌ఐ రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.






