19 June, 2026 | 7:30 PM

మగ్దుంపూర్‌లో సామూహిక అక్షరాభ్యాసం

19-06-2026 06:19 PM

నంగునూరు,(విజయక్రాంతి): మండల పరిధిలోని మగ్ధుంపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. సర్పంచ్ పాకాల శ్రీనివాస్ మాట్లాడుతూ..ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రధానోపాధ్యాయుడు బండారు ప్రసాద రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలో సరస్వతి పూజ అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం ప్రసాద రెడ్డి తన మనవరాలి పుట్టినరోజున చిన్నారులకు పలకలు,మిఠాయిలు పంచగా.. గ్రామస్థులు పబ్బ రాంబాబు, సాయికుమార్లు తమ తండ్రి జ్ఞాపకార్థం పాఠశాలకు ఫ్యాన్లను బహుకరించారు.