పల్లె దవాఖాన ప్రారంభం
26-05-2026 01:27 AM
సంస్థాన్ నారాయణపూర్, మే 25: మండలంలోని అల్లందేవి చెరువు గ్రామంలో పల్లె దవాఖానను డాక్టర్ రవీనాతో కలిసి సర్పంచ్ సుర్వి సౌజన్యరాజుగౌడ్ ప్రారంభించారు. గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేకపోవడంతో గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి పల్లె దవాఖానను ఏర్పాటు చేయాలని కోరగా వారం రోజుల్లోనే దవాఖాన ఏర్పాటు చేయడం హర్షణీయం అని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో దవాఖాన ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ తెలిపారు. డాక్టర్ శారదను పల్లెదవాఖనా వైద్యురాలిగా నియమిస్తున్నట్లు డాక్టర్ రవీనా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ముక్క్యర్ల కవిత స్వామియాదవ్, పంచాయతీ కార్యదర్శి బ్రహ్మచారి, వార్డు సభ్యులు వంటల సువర్ణ, గణేష్, సుర్వి వినోద్, అంతటి శివశంకర్, ఆశావర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.






