ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషి
కలెక్టర్ స్నేహ శబరిష్
మహబూబాబాద్, మే 25 (విజయక్రాంతి): ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని గంగపుత్ర భవన్ లో స్త్రీ వారోత్సవాల సందర్భంగా న్యూట్రిషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, కుకింగ్ పోటీలు, ఏఎంసీ చెకప్ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి హాజరైన మహిళలకు మాట్లాడుతూ ఏఎంసీ చెకప్ గురించి వివరాలు అడిగి తెలుసుకుని అందుతున్న వైద్య సేవల గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ నాణ్యమైన న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలని, అందుబాటులో ఉన్న అవకాశాలన్నీ వినియోగించుకొని, జంక్ ఫుడ్ ను తగ్గించాలని సూచించారు. కుకింగ్ పోటీల్లో పాల్గొన్న మహిళలను అభినందించారు.






