30 June, 2026 | 10:18 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

అమ్మ అమ్మేగా..

03-05-2026 12:17 AM

విజయ్ ఆంటోని, శశి దర్శకత్వంలో వచ్చిన ‘బిచ్చగాడు’, అందులోని అమ్మ పాటకు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. ఇప్పటికీ అమ్మ పాట అంటే అందరూ ఆ పాటనే ఎంచుకుంటారు. మళ్లీ అలాంటి ఓ ఎమోషనల్ మదర్ సాంగ్‌తో విజయ్ ఆంటోని, శశి ఆడియెన్స్ ముందుకు వచ్చారు. వీరి కాంబోలో మరో సినిమా ‘వంద దేవుళ్ళు’ రాబోతోంది.

తాజాగా ఈ సినిమా నుంచి ‘అమ్మ అమ్మేగా’ అంటూ అమ్మ గొప్పదనం గురించి చెప్పే పాటను విడుదల చేశారు. ఈ పాటకు భాష్యశ్రీ సాహిత్యం, బాలాజీ శ్రీరామ్ బాణీ, శ్రీకాంత్ హరిహరణ్ గాత్రం అన్నీ బాగా కుదిరాయి. రామాంజనేయులు జవ్వాజి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు ఎస్‌బీ దర్శన్ కిర్లోష్ కెమెరామెన్‌గా, బాలాజీ శ్రీరామ్ సంగీత దర్శకుడిగా పనిచేశారు. హరిష్ యువరాజ్ ఎడిటర్‌గా పనిచేశారు. ఈ సినిమా వేసవి కానుకగా మే నెలలో రిలీజ్ కానుంది.