3 May, 2026 | 1:45 AM

నయన్ కాదు.. కాజల్!

03-05-2026 12:22 AM

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం యంగ్ హీరోలతో పోటీపడుతూ వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ అందించిన మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఆ యన మళ్లీ జతకట్టడం అం తటా ఆసక్తిని రేకెత్తించింది. బాలకృష్ణ మలినేని కాంబోలో రాబోతున్న ఈ సినిమాకు తా త్కాలికంగా ‘ఎన్‌బీకే111’ అని పేరు పెట్టారు.

ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక విషయమై ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మొదట ఈ పీరియాడిక్ కథ కోసం నయన తారను అనుకున్నారు.  స్క్రిప్టులో జరిగిన మార్పు లు, కాల్ షీట్స్, రెమ్యూనరేషన్ సమస్య కారణంగా నయనతార తప్పుకోవడంతో ఆ స్థానంలో కాజల్ అగర్వాల్‌ను ఓకే చేశారని టాక్. బాలయ్య కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘భగవంత్ కేసరి’లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకు లను బాగా అలరించింది.

ఆ సెంటిమెంట్‌తోనే గోపీచంద్ మలినేని కూడా కాజల్‌ను సంప్రదించడం.. ఆమె కూడా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం చకచకా జరిగిపోయానని సమాచారం. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి రెండో షెడ్యూల్‌ను చిత్రబృందం తాజాగా ప్రారంభించింది. ముంబయి సెట్స్‌లో హై-ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2026లోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.