30 June, 2026 | 11:10 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

మా కష్టాన్ని తెరపై చూస్తారు

03-05-2026 12:15 AM

లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘సతీ లీలావతి’. దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ నిర్మించారు. తాతినేని సత్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మే 8న రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో శనివారం స్టార్ హీరో రామ్‌చరణ్ ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈ వెంట్‌లో లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.. “సతీ లీలావతి’ కోసం మేం పెట్టిన శ్రమ, మా ప్రేమ, మా కష్టం అం తా తెరపై ప్రేక్షకులు చూస్తారు. సినిమా అద్భుతంగా వచ్చింది. చిత్రీకరణ సమయంలో నేను ప్రెగ్నెంట్ అని తెలిశాక టీమ్ మొత్తం సపోర్ట్ చేసింది. మా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన మా బావ రామ్‌చరణ్‌కు థాంక్స్. ఆయన రిలీజ్ చేయడం వల్ల మా సినిమాకు రీచ్ పెరిగింది” అన్నారు.

దేవ్‌మోహన్ మాట్లాడుతూ.. “ఈ మూవీ, నేను పోషించిన పాత్ర చాలా కొత్తగా, విభిన్నంగా ఉంటుంది. లావణ్యతో నటించడం ఆనందంగా ఉంది. మే 8న మా సినిమాను అందరూ తప్పకుండా చూసి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నా” అన్నారు. ‘ఇది చాలా మంచి సినిమా. అందరూ థియేటర్కు వచ్చిన ఈ సినిమాని చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాన’ని డైరెక్టర్ తాతినేని సత్య అన్నారు. ‘మా సినిమా ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంటుంద’ని నిర్మాత నాగమోహన్ చెప్పారు.