10 July, 2026 | 7:47 PM

Breaking News

యాదగిరిగుట్ట పిఎసిఎస్ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   నాచారం కాంగ్రెస్ అధ్యక్షుడు నూతలకంటి రాజుకు ఘన సన్మానం   •   సుల్తానాబాద్ TGSWRS హాస్టల్‌లో విద్యార్థులకు హెల్త్ క్యాంప్   •   బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తే చర్యలు తప్పవు: నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ్ గౌడ్   •   వెలిమినేడు శివారులో గోవధ ఘటనపై సమగ్ర విచారణ జరపాలి   •   జానకంపేటలో ముగిసిన CATC క్యాట్క్-IV వార్షిక శిక్షణా శిబిరం   •   బిఎల్ఓకు బోధన్ ఆర్డిఓ ఎం.విజయకుమారికు సన్మానం   •   అనారోగ్య బాధితుడికి ఎల్‌వోసి అందజేత   •   ఘనంగా కేకే మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి.. లేకుంటే ఉద్యమాలు ఉధృతం: ఏఐఎస్ఎఫ్   •  

సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో విజిలెన్స్ దాడులు

24-04-2026 12:00 AM

ఆదిలాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రరర్ కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ విజిలెన్స్ అధికారులు దాడులు కలకలం రేపాయి. కరీంనగర్ ఎన్‌ఫోర్స్‌మెంట్  అండ్ విజిలెన్స్ ఎస్పీ శ్రీనివాస్ రావు ఆదేశాల మేరకు తొమ్మిది మందితో కూడిన బృందం సభ్యులు కార్యాలయంలో దాడులు చేసి రికార్డులు, ఇతర వాటి ని పరిశీలించారు.  దస్త్రాలను స్వాధీనం చేసుకుని వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

కాగా ప్రతి సంవత్సరం నిర్వహించే తనిఖీల్లో భాగంగానే కార్యాలయాన్ని సందర్శించడం జరిగిం దని అధికారుల బృందం తెలిపింది. రిజిస్ట్రర్ కార్యాలయంలో దాడులు జరుగుతున్నయన్న విషయం తెలుసుకున్న పలువురు డాక్యుమెంట్ రైటర్లు వారి దుకాణాలను మూసి వేశారు.

తనిఖీలో ఎలాంటి అనుమానం కలిగించే దస్త్రాలు లభించలేదని అదికారులు చెప్పారు.  ఈ దాడిలో ఐఓపీ అనిల్ కుమార్, తహసీల్దార్ దినేష్ రెడ్డి, అసిస్టెంట్ జియలజిస్ట్ వెంకట్ రెడ్డి, ఐఓపీలు వరప్రసాద్, రవీందర్, ప్రశాంత్ రావు తదితరులు పాల్గొన్నారు.