పెట్రోల్, డీజిల్ కోసం జనం పరుగు
24-04-2026 12:00 AM
కుబీర్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): బైంసా డివిజన్‌లో గురువారం పలు బంకుల్లో పెట్రోల్ డీజిల్ కోరత ఉందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంతో పెట్రోల్ బంకుల వద్దకు వాహనదారులు పరుగులు తీశారు. భైంసా, కుంటాల, లోకేశ్వరం, కుబీర్, తానూర్ మండలాల్లో ఉదయం నుంచి ద్విచక్ర వాహనదారులు, డాక్ట, డ్రైవర్లు పెట్రోల్ డీజిల్ కోసం బంకులకు తరలిరావడంతో కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేయడంతో ఎక్కడ పెట్రోల్ డీజిల్ దొరికితే అక్కడికి వెళ్లి నిలువ చేసుకున్నారు.






