10 July, 2026 | 8:00 PM

Breaking News

12న జిల్లా అథ్లెటిక్స్ పోటీలు   •   అశ్వాపురంలో బీఆర్ఎస్ మండల కార్యాలయాన్ని ప్రారంభించిన రేగా కాంతారావు   •   కౌన్సిలర్ వరప్రదీప్ కు అభినందనల వెల్లువ   •   13వ వార్డులో ప్రతి ఓటర్ వద్దకు సర్ ఫారాలు అందజేత   •   ఉపాధ్యాయులు లేక అటెండర్‌తోనే పాఠాలు..!   •   యాదగిరిగుట్ట పిఎసిఎస్ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   నాచారం కాంగ్రెస్ అధ్యక్షుడు నూతలకంటి రాజుకు ఘన సన్మానం   •   సుల్తానాబాద్ TGSWRS హాస్టల్‌లో విద్యార్థులకు హెల్త్ క్యాంప్   •   బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తే చర్యలు తప్పవు: నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ్ గౌడ్   •   వెలిమినేడు శివారులో గోవధ ఘటనపై సమగ్ర విచారణ జరపాలి   •  

నాచారం కాంగ్రెస్ అధ్యక్షుడు నూతలకంటి రాజుకు ఘన సన్మానం

10-07-2026 07:38 PM

ఉప్పల్,(విజయక్రాంతి): నాచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన నూతలకంటి రాజును హెచ్‌ఎంటీ నగర్ మసీదు కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, పూలమాల వేసి అభినందనలు తెలియజేశారు. నూతన బాధ్యతల్లో విజయవంతంగా ముందుకు సాగాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించాలని కమిటీ సభ్యులు ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆయన కృషి చేయాలని సూచిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ వహాబ్ (ఖదీర్ భాయ్), ఇక్బాల్ సాహెబ్, జావేద్ భాయ్, అక్తర్ భాయ్, ఖాదర్ భాయ్, అబ్దుల్ రావుఫ్, ఇమ్రాన్ సమద్ జావీద్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది.