24 April, 2026 | 2:49 AM

కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతి

24-04-2026 12:00 AM

మందమర్రి, ఏప్రిల్ 23 (విజయక్రాంతి) : క్యాతనపల్లి మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే, ఎంపీ, మున్సిపల్ ఎన్నికల్లో విధులు నిర్వహించిన మున్సిపల్ కార్మికులకు డబ్బులు చెల్లించాలని, సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 28న హైదరాబాద్ సిడిఎంఏ కార్యాలయం ముందు నిర్వహించే ధర్నాలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ సిఐటియు జిల్లా కార్యదర్శి కాసర్ల రాజలింగు, మున్సిపల్ యూనియన్ జిల్లా కమిటీ ఉపాధ్యక్షుడు దేవవరం, ఎల్లయ్య, రాజు, రవి, నారాయణ, రమేష్, తిరుపతి, పోశం, విష్ణు, గడ్డం రమేష్ తదితరులు పాల్గొన్నారు.