10 July, 2026 | 8:45 PM

Breaking News

యాదగిరిగుట్ట పిఎసిఎస్ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

10-07-2026 07:44 PM

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య  ముఖ్య అతిథిగా హాజరై నూతనంగా నియమితులైన పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం యాదగిరిగుట్ట మండల పిఎసిఎస్ నూతన చైర్మన్‌గా నియమితులైన చీర శ్రీశైలం పాలకమండలి సభ్యులను ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య  అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ... సహకార సంఘాలు రైతులకు అండగా నిలిచి వ్యవసాయాభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వ్యవసాయ రుణాలు, ఎరువులు, విత్తనాలు మరియు ఇతర సేవలను పారదర్శకంగా అందించడంలో పిఎసిఎస్   పాలకవర్గం బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. నూతనంగా ఎంపికైన పాలకవర్గం... పిఎసిఎస్ చైర్మన్ గా చీర శ్రీశైలం,సభ్యులు, శారాజి వెంకటేష్, గజం లక్ష్మీనరసయ్య, సుడుగు బాల్ రెడ్డి, ఎడ్ల రామ్ రెడ్డి, తిరుమణి ఐలయ్య, దిరావత్ నరసింహ, ఇందిరా వెంకటేష్, గుజ్జల రుక్కమ్మ, నువ్వుల రమేష్, బొజ్జ శ్రీనివాస్, జలిగం అండమ్మ,, నమిలే లింగం. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సహకార శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,రైతులు,  ప్రజలు పాల్గొన్నారు.