సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు
16-04-2026 04:07 PM
వరంగల్ (విజయక్రాంతి): వరంగల్ నగరంల్‌లోని ఖిలా వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. భూముల క్రయ, విక్రయాల్లో ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం స్టాంపు డ్యూటీ ఫీజులు కట్టించడం లేదనే సమాచారం మేరకు, విజిలెన్స్ డిప్యూటీ డైరెక్టర్ ఆదేశాలతో వరంగల్ రేంజ్ విజిలెన్స్ డీఎస్పీ మల్లయ్య, తహసీల్దార్ లక్ష్మణ్, విజిలెన్స్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేపట్టారు. రిజిస్ట్రేషన్ కార్యాలయ అధికారుల నుంచి డ్యాంకుమెంట్లు స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి చెల్లించే పన్నులు చెల్లింపులను పరిశీలుస్తున్నారు. తనిఖీలు అనంతరం వివరాలు వెల్లడిస్తామని విజిలెన్స్ డీఎస్పీ మల్లయ్య పేర్కొన్నారు.






