28 June, 2026 | 7:07 PM

ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి

28-06-2026 06:07 PM

- బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్

బెల్లంపల్లి,(విజయక్రాంతి): ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం ప్రతి తల్లిదండ్రుల బాధ్యతనీ, పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ చేయూత ఇవ్వాలనీ బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా, బూడిదిగడ్డ బస్తీలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాలను ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రారంభించారు. ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్  మాట్లాడుతూ... గతంలో పోలియో వ్యాధి అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపేదని, ప్రభుత్వాలు చేపట్టిన నిరంతర పల్స్ పోలియో కార్యక్రమాల ఫలితంగా నేడు దేశం పోలియో నిర్మూలన దిశగా విజయవంతంగా ముందుకు సాగుతోందని అన్నారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలువేయించాలన్నారు.

ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఈ సేవను  సద్వినియోగం చేసుకోవాలినీ కోరారు.. ఒక్క చిన్నారి కూడా మిగలకుండా పోలియో చుక్కలు వేయించిలన్నారు. ఆరోగ్యవంతమైన బెల్లంపల్లి నిర్మాణానికి అందరూ సహకరించాలనీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దావ స్వాతి రమేష్, ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.