28 June, 2026 | 6:35 PM

బెల్లంపల్లిలో హత్య కలకలం

28-06-2026 05:26 PM

- బెల్లంపల్లిలో దారుణం 

- చంద్రవల్లిలో ఘటన

- అన్న చేతిలో తమ్ముడి హతం

- భూవివాదాలే కారణం

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. భూవివాదం అన్నా తమ్ముళ్ళ మధ్య చిచ్చిపెట్టింది. ఒకరిని బలిగొన్నది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చంద్రవల్లి గ్రామానికి చెందిన చందనవేని రాజేష్, చందు అన్నదమ్ములు భూమి విషయంలో కొంతకాలంగా గొడవ పడుతున్నారు. ఇద్దరి మధ్య భూతగాధ తీవ్రరూపం దాల్చింది. ఇదే విషయమై ఇద్దరు మరొకసారి వాగ్వాదం పెట్టుకున్నారు.

అదికాస్తా  ముదిరిపోయింది. ఇద్దరి మధ్య మాటామాట పెరిగిపోయింది. దీంతో కోపోద్రిక్తుడైన చంద్ తమ్ముడు రాజేష్ పై గోడ్డలితో దాడి చేసి హతమార్చాడు. ఈ సంఘటన గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. భూమి కోసం గొడవ ఇద్దరు అన్నదమ్ముల రక్తబంధాన్ని రక్త సిక్తం చేసింది. సంఘటనా స్థలాన్ని బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, బెల్లంపల్లి రూరల్ సీఐ హనోక్ సందర్శించారు. మృతునికి భార్య రవళి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈమేరకు తాళ్ళ గురజాల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.