28 June, 2026 | 6:17 PM

సుల్తానాబాద్ లో ఘనంగా పీవీ నరసింహారావు జయంతి వేడుకలు

28-06-2026 05:31 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజ్జన్న ఆదేశాల మేరకు ఆదివారం సుల్తానాబాద్  బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దనాయక్ దామోదర్ రావు ఆధ్వర్యంలో స్థానిక నెహ్రూ విగ్రహం వద్ద పి వి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా దామోదర్ రావు  మాట్లాడుతూ... దక్షిణ భారతదేశం నుండి తొలి ప్రధాని పి వి అని, ఆర్ధిక సంస్కరణల గొప్ప వ్యక్తి మరియు 17 భాషల్లలో ప్రావీణ్యం కలిగిన బహు భాష ప్రజ్ఞాశాలుడు. నవోదయం పాఠశాల రూపకర్త, భారత దేశం ఆర్థికంగా వెనుకబడితే విదేశాల్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి తీసుకొచ్చిన అపర చాణిక్యుడు మన పి వి నరసింహ రావు  అని అన్నారు.