28 June, 2026 | 6:51 PM

రైతు ఆశీర్వాద సభ వేదిక వద్దకు చేరుకోవాల్సిన మార్గాలు: వైరా ఏసీపీ

28-06-2026 05:37 PM

ఖమ్మం,చింతకాని,(విజయక్రాంతి): ఈనెల 30న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పర్యటన నేపథ్యంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించిన మార్గాలలో ప్రయాణించి చింతకాని మండలం, జగన్నాధపురం గ్రామంలో జరిగే రైతు ఆశీర్వాద సభ వేదిక వద్దకు సురక్షితంగా చేరుకోవాల్సిందిగా వైరా ఏసీపీ సారంగపాణి విజ్ఞప్తి చేశారు.

రైతు ఆశీర్వాద సభకు విచ్చేయు ప్రజలందరూ ట్రాఫిక్ పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించి, తమకు కేటాయించిన పార్కింగ్ స్థలాలలోనే వాహనాలను నిలిపి సభా ప్రాంగణానికి చేరుకోవాలని సూచించారు.

మార్గాలు:

రైతు ఆశీర్వాద సభకు విచ్చేయు ప్రజలకు ట్రాఫిక్ మరియు పార్కింగ్ సూచనలు..

1. పాలేరు నియోజకవర్గం కు చెందిన  4 మండలాలు, ముదిగొండ మండలం నుండి రైతు ఆశీర్వాద సభకు విచ్చేయు బస్సులు,ప్రజలు వెంకటగిరి ఎక్స్ రోడ్ వద్ద హైవే ఎక్కి, థంసలాపురం వద్ద దిగి, పందిళ్లపల్లి మీదుగా వచ్చి వారికి కేటాయించిన పార్కింగ్ స్థలాలు 1 నుండి 5 వరకు వినియోగించుకోవలెను.

2. కారేపల్లి, కామేపల్లి మండలాల నుండి వచ్చే బస్సులు, ప్రజలు ఖమ్మం టౌన్ – ముస్తఫా నగర్ మీదుగా పందిళ్లపల్లి చేరుకొని వారికి కేటాయించిన పార్కింగ్ స్థలాలు 1 నుండి 5 వరకు వినియోగించుకోవలెను.

3. సత్తుపల్లి, పెనుబల్లి, వేంసూర్, కల్లూరు మండలాల నుండి వచ్చే బస్సులు, ప్రజలు  కల్లూరు వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్కి, చింతకాని మండలం కోదుమూరు వద్ద దిగి, చింతకాని మీదుగా వచ్చి వారికి కేటాయించిన పార్కింగ్ స్థలాలు 7, 8 మరియు 15 వినియోగించుకోవలెను.

4. వైరా, కొనిజర్ల మండలాల నుండి వచ్చే ప్రజలు కొనిజర్ల మండలం బస్వాపురం, పెద్ద గోపతి, నేరేడ మీదుగా, చింతకాని ద్వారా వచ్చి వారికి కేటాయించిన పార్కింగ్ స్థలాలు 7, 8 మరియు 15 వినియోగించుకోవలెను.

5. ఏన్కూరు, తల్లాడ మండలాల నుండి వచ్చే బస్సులు, ప్రజలు వి. వెంకటాయపాలెం – వందనం – చింతకాని మార్గం ద్వారా వచ్చి వారికి కేటాయించిన పార్కింగ్ స్థలాలు 7, 8 మరియు 15 వినియోగించుకోవలెను.

6. ఎర్రుపాలెం, మధిర, బోనకల్లు, చింతకాని మండలాల నుండి వచ్చే ప్రజలు బోనకల్లు – నాగలంచ మార్గం ద్వారా వచ్చి వారికి కేటాయించిన పార్కింగ్ స్థలాలు 10, 11, 12, 13 మరియు 14 వినియోగించుకోవలెను.

7.చింతకాని మండలం మత్కేపల్లి నామవరం వైపు ఉన్న ముదిగొండ మండలానికి సంబంధించిన  గ్రామాలకు చెందిన బస్సులు, ప్రజలు మత్కేపల్లి క్రాస్ రోడ్డు నుంచి పందిల్లపల్లి ద్వారా వారికి కేటాయించినా పార్కింగ్ స్థానాలు 1 నుంచి 5 వరకు చేరుకోగలరు