16 April, 2026 | 10:43 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

ప్రజా పాలన మండల స్థాయి సమావేశం

16-04-2026 04:09 PM

జైనూర్/లింగాపూర్ (విజయక్రాంతి): లింగాపూర్ మండలంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం లింగాపూర్ రైతు వేదికలో మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల ప్రత్యేక అధికారి డాక్టర్ ఎం. సురేష్ కుమార్ పాల్గొని ప్రజా పాలన అమలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, ప్రజలకు అందించాల్సిన సేవలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖల అధికారుల పనితీరును పరిశీలించి, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా చేరేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎ. రాంచందర్, తహసీల్దార్, మండల స్థాయి అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.