క్రీడల్లో గెలుపోటమిలు సహజం
24-08-2026 02:12 AM
జడ్చర్ల, ఆగస్టు 23: జడ్చర్ల నియోజకవర్గ ఉన్నత పాఠశాల విద్యార్థుల క్రికెట్ టోర్నమెంట్ను గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్లో ఎస్వీకేఎం, శ్లోకా పాఠశాల విద్యార్థులు ఫైనల్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఏకాగ్రత, పట్టుదల పెంచడంతో పాటు లక్ష్యసాధనకు దోహదపడతాయని అన్నారు. క్రీడలతో పాటు చదువులోనూ రాణించాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ధూమర్ల నిరంజన్, జిల్లా ప్రధాన కార్యదర్శి మొగులాల్, మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.






