24 August, 2026 | 3:34 AM

పంచాయతీ బాగుంటేనే దేశం బాగుంటుంది

24-08-2026 02:15 AM

నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎంఆర్

మూసాపేట్ ఆగస్టు 23: పంచాయతీలోని ప్రజలు బాగుంటేనే రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉంటాయని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆదివారం  సంకల్ మద్ది గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనం ను ఎమ్మెల్యే  జి. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హై మాస్ట్ లైట్లను ప్రారంభించడం జరిగిందన్నారు.

గ్రామంలో పలు ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలలోపాల్గొని, లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు భద్రాద్రి శ్రీ. సీతారామచంద్ర స్వామి ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధి పనులకు రూ 351 కోట్ల నిధులు, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ 250 కోట్ల నిధులు, కురుమూర్తి స్వామి ఆలయ అభివృద్ధి పనులకు రూ 110 కోట్ల నిధులు మంజూరు చేసి, దేవాలయాలను మరింత అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలనే సంకల్పంతో సిఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శెట్టి చంద్రశేఖర్, ఎంపీడీవో కృష్ణయ్య వివిధ గ్రామాల సర్పంచులు  మేరెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి, నాగరాజు రామచంద్రయ్య, రవి రాజా చారి,  ఉపసర్పంచ్ గౌతమ్,మాజీ ఎంపీటీసీ ఆంజనేయులు, నారాయణ,హైమద్, లక్ష్మీకాంత్ రెడ్డి సిద్దు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.