10 May, 2026 | 2:46 PM

Breaking News

సీఎం విజయ్‌కి అభినందనలు తెలిసిన ప్రధాని మోదీ   •   మల్లెల మడుగులో ప్రగతి పరుగు..   •   లేబర్ కోడ్లు రద్దు చెయ్యాలని కోరుతూ గెజిట్ ప్రతులు దగ్దం   •   అధికారుల అలసత్వం వల్ల అకాల వర్షాలకు నష్ట పోయిన రైతులు – సీపీఎం జిల్లా నాయకులు పిట్టల అర్జున్   •   వనదుర్గమ్మ ఆదాయానికి అధికారుల గండి   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం సద్వినియోగం చేసుకోవాలి   •   కియా సైరోస్ ప్రారంభించిన హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి   •   కందనూల్ క్విడ్ ప్రోకో వ్యవహారంలో పరస్పర దాడులు.!   •   అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •  

అయ్యప్ప స్వాములకు అన్నదానం చేసిన వెంగళ దాసు శ్రీధర్

03-12-2025 06:54 PM

శ్రీధర్ కు ఘనంగా సన్మానం..

సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రినగర్ లో నూతనంగా నిర్మాణమైన అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం అయ్యప్ప స్వాములకు టాక్స్ కన్సల్టెంట్, అడ్వకేట్ వెంగళ దాసు శ్రీధర్ అన్నదానం చేశారు. అంతకు ముందు అయ్యప్ప స్వామి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ వ్యవస్థాపకులు, చైర్మన్ సాయిరీ మహేందర్, గురు స్వామి మిట్టపల్లి మురళీధర్ లు స్వామి వారి మెమొంటో అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చీఫ్ అడ్వైజర్ కందుకూరి ప్రకాష్ రావు, ముత్యాల రవీందర్, భక్త బృందం కుమార్ కిషోర్, ఉస్తం గణేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు.