10 May, 2026 | 3:00 PM

Breaking News

సీఎం విజయ్‌కి అభినందనలు తెలిసిన ప్రధాని మోదీ   •   మల్లెల మడుగులో ప్రగతి పరుగు..   •   లేబర్ కోడ్లు రద్దు చెయ్యాలని కోరుతూ గెజిట్ ప్రతులు దగ్దం   •   అధికారుల అలసత్వం వల్ల అకాల వర్షాలకు నష్ట పోయిన రైతులు – సీపీఎం జిల్లా నాయకులు పిట్టల అర్జున్   •   వనదుర్గమ్మ ఆదాయానికి అధికారుల గండి   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం సద్వినియోగం చేసుకోవాలి   •   కియా సైరోస్ ప్రారంభించిన హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి   •   కందనూల్ క్విడ్ ప్రోకో వ్యవహారంలో పరస్పర దాడులు.!   •   అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •  

మల్లెల మడుగులో ప్రగతి పరుగు..

10-05-2026 02:25 PM

అభివృద్ధిని ఓర్వలేక విషం చిమ్మితే కఠిన చర్యలు

అశ్వాపురం,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మల్లెల మడుగు గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. స్థానిక సర్పంచ్ మచ్చ నరసింహారావు అలుపెరగని కృషి, శాసనసభ్యులు (ఎమ్మెల్యే) వెంకటేశ్వర్లు సంపూర్ణ సహకారంతో గ్రామంలో కోట్లాది రూపాయల నిధులతో మౌలిక సదుపాయాల కల్పన శరవేగంగా జరుగుతోంది. రవాణా, తాగునీరు, విద్యుత్, గృహ నిర్మాణం లాంటి మౌలిక వసతుల కల్పనలో గ్రామం ఆదర్శంగా నిలుస్తోందని, అలాగే స్థానిక ప్రజల చిరకాల కోరికలను నెరవేరుస్తూ ఎమ్మెల్యే సహకారంతో అనేక పనులకు నిధులు మంజూరయ్యాయని గ్రామ అధ్యక్షుడు బారాజు సంపత్ ఒక ప్రకటనలో తెలిపారు.

2025-26 సంవత్సరానికి గాను నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తూ గ్రామానికి 50 ఇందిరమ్మ ఇండ్ల కోసం రూ. 2 కోట్ల 50 లక్షలు, మల్లన్న స్వామి గుడి వద్ద రూ. 25 లక్షలతో, గుడ్ల పెద్ద వెంకటి ఇంటి వద్ద రూ. 5 లక్షలతో నూతన కల్వర్టుల నిర్మాణం, బొడ్డు రాములు ఇంటి దగ్గర నుంచి గుద్దేటి ఉపేందర్ ఇంటి వరకు రూ. 7 లక్షలతో, చంచల నరసయ్య ఇంటి నుంచి గొడ్ల శ్రీను ఇంటి వరకు రూ. 5 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు ఆయన వెల్లడించారు. వీటితో పాటు గ్రామస్తుల దాహార్తిని తీర్చేందుకు అదనంగా 100 కేఎల్ సామర్థ్యం గల వాటర్ ట్యాంక్, గ్రామపంచాయతీకి నూతన భవనం, పశువుల కోసం ప్రత్యేకంగా స్టాండ్, పంచాయతీ పరిధిలోని అన్ని విద్యుత్ స్తంభాలకు నాణ్యమైన ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుతో పాటు చింతకుంటకు నూతన విద్యుత్ సౌకర్యం కూడా మంజూరయ్యాయని వివరించారు.

ప్రాంత అభివృద్ధి కోసం స్థానిక ప్రజా ప్రతినిధులు రాత్రింబవళ్లు కష్టపడుతుంటే.. కొందరు తమ పైశాచిక ఆనందం కోసం సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై, ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు, సర్పంచ్ మచ్చ నరసింహారావు తదితర స్థానిక నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని బారాజు సంపత్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినంత ఈజీగా అభివృద్ధి జరగదని, ఎంతో శ్రమ, నిరంతర పర్యవేక్షణతోనే నిధులు మంజూరవుతాయని, అభివృద్ధిని ఓర్వలేక ఇష్టానుసారంగా అవాకులు చవాకులు పేలితే ఇకపై చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని, తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన గట్టిగా హెచ్చరించారు.