వనదుర్గమ్మ ఆదాయానికి అధికారుల గండి
* ఏకంగా 18 మందికి ఉచితంగా ప్రత్యేక దర్శనం చిట్టి రాసిచ్చిన అధికారులు
* గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉన్న సామాన్య భక్తుల సంగతేంటి?
* ఇష్టారీతిన వ్యవహరిస్తున్న అధికారులు
పాపన్నపేట: మనం దేవాదాయ శాఖలో పనిచేస్తుంటే.. మనకు తెలిసిన భక్తులు దర్శనానికి వస్తే.. ఒకరిద్దరిని పంపిస్తే అందులో ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. అలాకాకుండా పదుల్లో వస్తే సగం మంది భక్తులకైనా దర్శనం టికెట్లు తీసుకోమని చెప్పాలి. అలా కాకుండా ఎంతమంది వస్తే అంతమందికి ఉచితంగా ప్రత్యేక విఐపి దర్శనం పంపించడమంటే ఆదాయానికి గండి కొట్టినట్టే. అదే సామాన్య భక్తుడికి ఆ అవకాశం ఇవ్వకపోగా ఉచిత దర్శనంలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.
సామాన్య భక్తుడు గంటల తరబడి వనదుర్గమ్మ దర్శనం కోసం క్యూ లైన్ లో వేచి ఉంటుంటే.. ఇలాంటి వ్యక్తులు పదుల సంఖ్యలో ప్రత్యేక దర్శనం కు వెళ్తున్నారు. దీంతో ఆదాయానికి నష్టం వాటిల్లడంతో పాటు సామాన్య భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. 18 మందికి ఉచిత దర్శనంకు చిట్టి రాశారని అడగ్గా.. దేవదాయ శాఖ అధికారి ఎవరో ఫోన్ చేయడంతో రాసిచ్చామని ఈఓ వీరేశం బదులిచ్చారు.






