10 May, 2026 | 1:56 PM

Breaking News

కందనూల్ క్విడ్ ప్రోకో వ్యవహారంలో పరస్పర దాడులు.!   •   అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •   నేను మీ అందరివాణ్ని.. మద్ధతు ఇచ్చిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు: తమిళనాడు సీఎం విజయ్   •   తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్   •   తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •  

మూడో విడత నామినేషన్లు ప్రారంభం

03-12-2025 06:51 PM

సంస్థాన్ నారాయణపూర్ (విజయక్రాంతి): సంస్థాన్ నారాయణపురం మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ మూడో విడత ప్రక్రియ బుధవారం మొదలైంది. మండల వ్యాప్తంగా 31 గ్రామ పంచాయితీలకు గాను ఏడు క్లస్టర్లుగా ఏర్పాటు చేసి 31 సర్పంచ్, 260 వార్డు మెంబర్లకు నామినేషన్ ప్రక్రియ అధికారులు ప్రారంభించారు. తొలిరోజు 14 మంది సర్పంచ్ అభ్యర్థులు, 17 మంది వార్డు సభ్యులుగా నామినేషన్లు దాఖలు చేశారని అధికారులు తెలిపారు. గ్రామాల్లో ఏకగ్రీవాల చర్చ జోరుగా నడుస్తుంది. నారాయణపూర్ మండల పరిధిలోని తండాలలో ఎక్కువగా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి నాయకులు జోరుగా చర్చిస్తున్నారని ఊహాగానాలు వినపడుతున్నాయి. ఇంతలోనే పార్టీల మార్పులు కూడా జోరుగా కొనసాగుతున్నాయి. టికెట్ ఆశించిన నేతలకు భంగపాటు కలగడంతో ప్రత్యామ్నాయంగా ఇతర పార్టీలలో చేరడానికి అభ్యర్థులు మొగ్గు చూపుతున్నారు.