10 May, 2026 | 1:38 PM

Breaking News

అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •   నేను మీ అందరివాణ్ని.. మద్ధతు ఇచ్చిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు: తమిళనాడు సీఎం విజయ్   •   తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్   •   తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •  

మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు

10-05-2026 12:44 PM

కేసముద్రం,(విజయక్రాంతి): రాష్ట్ర రాజధాని పరేడ్ గ్రౌండ్లో ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనున్న బహిరంగ సభకు కేసముద్రం ప్రాంతం నుండి ప్రత్యేక రైలులో భారతీయ జనతా పార్టీ నేతలు తరలి వెళ్లారు. విజయవాడ నుండి సికింద్రాబాద్ వరకు ఆదివారం ప్రవేశపెట్టిన ప్రత్యేక రైలులో వివిధ ప్రాంతాల నుండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు వెళ్లారు. ఇందులో కార్యకర్తలకు నాయకులకు భోజన వసతి కూడా కల్పించారు. మహబూబాబాద్ జిల్లా పరిధిలోని డోర్నకల్, మహబూబాబాద్, కేసముద్రం రైల్వే స్టేషన్ల నుండి భారీగా కార్యకర్తలు, నాయకులు తరలి వెళ్లారు.