10 May, 2026 | 2:41 PM

Breaking News

మల్లెల మడుగులో ప్రగతి పరుగు..   •   లేబర్ కోడ్లు రద్దు చెయ్యాలని కోరుతూ గెజిట్ ప్రతులు దగ్దం   •   అధికారుల అలసత్వం వల్ల అకాల వర్షాలకు నష్ట పోయిన రైతులు – సీపీఎం జిల్లా నాయకులు పిట్టల అర్జున్   •   వనదుర్గమ్మ ఆదాయానికి అధికారుల గండి   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం సద్వినియోగం చేసుకోవాలి   •   కియా సైరోస్ ప్రారంభించిన హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి   •   కందనూల్ క్విడ్ ప్రోకో వ్యవహారంలో పరస్పర దాడులు.!   •   అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •   నేను మీ అందరివాణ్ని.. మద్ధతు ఇచ్చిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు: తమిళనాడు సీఎం విజయ్   •  

కందనూల్ క్విడ్ ప్రోకో వ్యవహారంలో పరస్పర దాడులు.!

10-05-2026 01:52 PM

- పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

బిజినేపల్లి: ఆదివారం విజయక్రాంతిలో ప్రచురితమైన కందనూలులో క్విడ్ ప్రోకో కథనంతో బాధితుల్లో ఆశలు చిగురించి తమ వ్యవసాయ పొలంలో వేసిన అక్రమ వెంచరుకు వచ్చారు. విషయం తెలిసిన అధికార పార్టీకి చెందిన ఓ ప్రధాన నాయకుడు అడ్డుకుని భూమి కోర్టు కేసులో ఉండగ వెంచరులోకి రావడం తగదంటూ గొడవకు దిగారు.  ఇరు వర్గాల మధ్య మాట మాట పెరిగి దాడులు చేసుకున్నారు. పాలమూరుకు నిర్వాసిత బాధితులు, మండలానికి చెందిన నాయకులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటుండగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు దాడులను అడ్డుకొని గాయాలతో ఉన్న బాధితున్ని నాగరుకర్నూల్ ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకొని పోలీసులకు పిర్యాదులు చేశారు.