31 August, 2026 | 2:14 AM

రోడ్డుపైనే వాహనాలు..

31-08-2026 12:00 AM
  1. పార్కింగ్ లేదు...సెక్యూరిటీ గార్డ్ ఉండరు 
  2. నిత్యం రద్దీ.. తరచూ ప్రమాదాలు
  3. ప్రమాదకరంగా మారిన రహదారి 

బోయినపల్లి : ఆగస్టు 30 ( విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి సమీపంలోని ఒక హోటల్ ముందు నిత్యం మోటార్ సైకిల్, ఆ టోలు, కార్లు, లారీలు ఇతర వాహనాలు రో డ్డు పైనే నిలుపుతున్నారు. హోటల్ యజమాని పార్కింగ్ తో పాటు వాహనాలను క్ర మబద్ధీకరించేందుకు సెక్యూరిటీ గార్డ్ ను ఏ ర్పాటు చేసుకోవాలి. కానీ ఈ నిబంధనలు ఏమి పాటించకపోవడంతో ప్రయాణికులు హోటల్ ముందు రోడ్డు పైననే వాహనాల ను నిలుపుతున్నారు.

దీంతో ఈ రహదారి ఇక్కడ రద్దీగా మారి ప్రమాదకరంగా మారిం ది.దీంతో ఈ రహదారి నుంచి కరీంనగర్ వై పు వెళ్లే ప్రజలు ప్రయాణికులు ప్రాణాలు అ రచేతిలో పెట్టుకుని వెళ్తున్నారు. ఈ హోటల్ వద్ద రోడ్డుపైన 2024 డిసెంబర్ నెలలో ఆగి ఉన్న లారీని కరీంనగర్ వైపు వెళ్తున్న కారు ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ దుర్ఘటనలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు నుజ్జు నుజ్జు కాగా మృతులను క్షతగాత్రులను కారులోంచి తీయడానికి పోలీసులు ప్రజలు నానా తంతాలు పడ్డారు.

అంటే అంత ఘోరమైన సంఘటన జరిగింది. ఈ సంఘటననే కాకుండా ఇంకా ఎన్నో వాహనాలు ఢీకొని గాయాలపాలై ఆసుపత్రి పాలైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అప్పట్లో పోలీసులు గ్రామపంచాయతీ వారు సదరు హోటల్ యజమానికి నోటీసు అందించారు. పార్కింగ్ ఏర్పాటు చేసుకొని సెక్యూరిటీ గార్డ్ ఏర్పాటు చేసుకోవాలని ఇచ్చిన నోటీసులో తెలిపారు. కానీ యజమాని మాత్రం ఇప్పటివరకు పార్కింగ్ ఏర్పాటు చేసుకోలేదు, వానలను క్రమబద్ధీకరించేందుకు సెక్యూరిటీ గార్డెన్ కూడా ఏర్పాటు చేసుకోలేదు. 

ఇప్పుడు యధావిధిగా మళ్లీ వాహనాలు రోడ్డుపైన నిలుపుతూ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలగడం పాటు, ప్రయాణికులు ఈ హోటల్ వద్ద భయం భయంతో ప్రయాణం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రమాద సూచికల బోర్డు కానీ యజమానితో మాట్లాడి పార్కింగ్ స్థలం సెక్యూరిటీ గార్డు ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.