31 August, 2026 | 12:57 AM

హైదరాబాద్ తర్వాత కరీంనగర్

31-08-2026 12:00 AM

గంజాయి మత్తులో యువత

కరీంనగర్, ఆగస్టు30(విజయక్రాంతి): హైదరాబాద్ తర్వాత కరీంనగర్ జిల్లా గంజాయి, మత్తుపదార్థాల (డ్రగ్స్) సరఫరా (Supply of marijuana and drugs), వాడకంలో ప్రధాన కేంద్రాలుగా మారుతుండ టం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలి కా లంలో కరీంనగర్లో వరుసగా పట్టుబడుతున్న గంజాయి నిల్వలు, డ్రగ్ ముఠాలే దీనికి నిదర్శనం. యువత, విద్యార్థులే లక్ష్యంగా నెట్వ ర్క్ కొనసాగుతుంది, కేవలం ఎండు గంజా యే కాకుండా, యువతను ఆకర్షించడానికి ఎక్కువ మత్తునిచ్చే హాష్ ఆయిల్ , డ్రగ్ టా బ్లెట్లను కరీంనగర్ పరిసరాల్లో విక్రయిస్తున్నారు.  ఇటీవల బొమ్మకల్ పరిసరాల్లో పో లీసులు జరిపిన దాడుల్లో హాష్ ఆయిల్, సి రంజీలతో సహా 9 మంది యువకులను (వీరిలో కొందరు బీటెక్, డిగ్రీ విద్యార్థులు) అరె స్ట్ చేశారు. వీరి వద్ద హాష్ ఆయిల్ లభ్యంకావడం తో పోలీసులే ఉలిక్కిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా, ఒడిశా సరిహద్దు ప్రాం తాల నుండి రైళ్లు, ప్రైవేట్ వాహనాల ద్వారా కరీంనగర్‌కు ఈ మత్తు పదార్థాలు పెద్ద ఎ త్తున రవాణా అవుతున్నాయి.కరీంనగర్ జి ల్లాలో గంజాయి వాడకం పెరిగింది అనడానికి నిదర్శనం కరీంనగర్ పోలీస్ కమిషనరే ట్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన దా దాపు 63.6 కేజీల గంజాయిని ఇటీవల పోలీస్ కమిషనర్ సమక్షంలో అధికారికంగా తగులబెట్టి ధ్వంసం చేయడం.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎలైట్ వింగ్ ’ఈగల్ ఫోర్స్’ నార్కోటిక్స్ కంట్రోల్ సెల్ కరీం నగర్ జిల్లాపై ప్రత్యేక నిఘా ఉంచి వినియోగదారులను, విక్రేతలను పట్టుకుంటు న్నా రు.  నిబంధనలకు విరుద్ధంగా మత్తునిచ్చే డ్ర గ్ టాబ్లెట్లను విక్రయిస్తున్న స్థానిక మెడికల్ షాపుల నిర్వాహకులపై కూడా పోలీసులు ఎన్ డి పి ఎఎస్ యాక్ట్ కింద కేసులు నమో దు చేస్తున్నారు.

గ్రామీణ ప్రాంతాలకు విస్తరణ

గతంలో కేవలం నగరాలకే పరిమితమైన ఈ గంజాయి సంస్కృతి, ప్రస్తుతం కరీంనగ ర్ రూరల్ ప్రాంతం తో పాటు సమీప జిల్లాలైన జగిత్యాల, సిరిసిల్ల  ప్రాంతాల్లోని యు వతకు కూడా విస్తరిస్తోంది, యువత గంజా యి మత్తుకు బానిసవుతుండటంతో స్థానిక ప్రజలను భయాందోళనకు గురావుతున్నారు.

ప్రమాదకరం హ్యాష్ ఆయిల్

హ్యాష్ ఆయిల్ గంజాయి నుండి రసాయన ప్రక్రియ ద్వారా సేకరించే అత్యంత సాంద్రత కలిగిన మాదకద్రవ్యం గంజాయి ఆకులు, పువ్వుల నుండి ప్రత్యేక ద్రావణాల ను ఉపయోగించి దీనిని తయారు చేస్తారు. సాధారణ గంజాయి కంటే ఇందులో మత్తు పదార్థం చాలా ఎక్కువ శాతంలో ఉంటుం ది. సాధారణ గంజాయి కన్నా హ్యాష్ ఆయి ల్ అనేక రెట్లు ఎక్కువ తీవ్రమైన మత్తును కలిగిస్తుంది. ఇది శరీరంపై, మెదడుపై తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపుతుంది.