పీడీ ఎఫ్ బియ్యం తరలిస్తున్న వాహనం పట్టివేత.. ఇద్దరు అరెస్టు
బెల్లంపల్లి, (విజయ క్రాంతి): మంచిర్యాల జిల్లా దేవాపూర్లో 56 క్వింటళ్ల పీడీఎఫ్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని దేవాపుర్ పోలీసులు పట్టుకుని, ఇద్దరినీ అరెస్టు చేశారు. ఎస్సై గంగారాం తెలిపిన వివరాల ప్రకారం.. 24న ఉదయం 4 గంటలకు ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు దేవాపూర్ పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా, సుమారు 4:30 గంటలకు ధర్మారావుపేట వైపు నుండి కొండాపూర్ గ్రామం వైపు అనుమానాస్పద పరిస్థితుల్లో వెళుతున్న ఒక మహేంద్ర బుల్లోరా పికప్ వాహనం( రిజిస్ట్రేషన్ నెంబర్ TG 24 T 1643)ను గుర్తించి తనిఖీ చేశారు.
అందులో పిడిఎఫ్ బియ్యం ఉన్న 112 PDS బియ్యం సంచులు ఒక్కో సంచి సుమారు 50 కిలోల బరువుతో మొత్తం 56 క్వింటలు, సుమారు 1,12,000 విలువైన బియ్యం ఉన్నట్లు గుర్తించారు, ఈ ఘటనపై పోలీసులు విచారణ చేయగా నాయిని సతీష్, అమరావతి ఉపేందర్ లను నిందితులుగా గుర్తించారు. నాయిని సతీష్ చుట్టుపక్క గ్రామాల్లో PDS బియ్యంను రూ.16 కొనుగోలు చేసి అదే బియ్యాన్ని కోడూరి శ్రీనివాస్ కు అప్పగించాడు. ఆయన పీడీఎఫ్ బియ్యాన్ని చెన్నూర్ లో విక్రయిస్తుంటాడు. పట్టుపడిన నిందితులతో పాటు మహేంద్ర బుల్లోరా పికప్ వాహనాన్ని దేవాపూర్ పోలిస్టేషన్ కు తరించారు. ఈమేరకు దేవపూర్ ఎస్సై ఏ గంగారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






