21-02-2026 02:25:56 AM
కుమ్రంభీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి20( విజయక్రాంతి): జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఎంవి రమేష్ బదిలీ కావడంతో మంచిర్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య ఆసిఫాబాద్ జిల్లా కోర్టు ఫుల్ అడిషనల్ ఇంచార్జ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు ప్రధాన న్యాయమూర్తిని బార్ అసోసియేషన్‌కు ఆహ్వానించి పూలగుచ్చం, శాలువాతో ఘనం గా సన్మానించారు.
అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు మాట్లాడారు. సీనియర్ సివిల్ జడ్జి యువరాజు మాట్లాడుతూ.. ఆసిఫాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు విధుల పట్ల నిబద్ధతతో బెంచ్‌బార్ సమన్వయాన్ని సవ్యంగా నడుపుతున్నారని కొనియాడారు. నూతన ఇంచార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య మాట్లాడుతూ ప్రతి వారం ఒక రోజు బెంచ్ నిర్వహించి పెండింగ్ కేసుల త్వరిత పరిష్కారానికి న్యాయవాదులు సహకరించాలని కోరారు.